కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం! మహానాడు వేదికగా ... లోకేష్ కు పట్టం!
Mon May 26, 2025 10:22 Politics.202505269989.jpg)
ఈ కింద ఇచ్చిన సమాచారం నెట్టింట వైరల్ గా..
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, రాజకీయంగా కొత్త నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్దం అవుతోం ది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలి మహానాడు కు భారీగా ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. టీడీపీలో నారా లోకేష్ కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవనుంది. ప్రభుత్వంలో ప్రమోష న్ కు సమయం ఉండటంతో.. ముందుగా పార్టీలో ప్రమోషన్ దాదాపు ఖరారైంది.
మహానాడు వేదికగా
కడప వేదికగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణయాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు. కాగా, మంత్రి లోకేష్ కు పార్టీలో - ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంత కాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ పైన జనసేన నేతలు విభేదించారు. దీంతో, ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
లోకేష్ కు పట్టం
కాగా, ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతల పైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్ ప్రెసిడెంట్)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. పార్టీ అధినేతగా - సీఎం బాధ్యతల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీ నిర్వహణ ఇక లోకేష్ కు అప్పగించాలనే చర్చ వినిపిస్తోంది. 2014-19 కాలంలో పార్టీని విస్మరించిన కారణంగానే 2019 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు.
మారుతున్న పరిస్థితులు
క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్లో వేగంగా మార్పు కనిపిస్తోంది. పార్టీ పైన దృష్టి పెట్టకపోతే 2014- 2019 అనుభవాలు పునరావృతమవుతాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, పార్టీ నుంచి సరికొత్త ప్రతిపాదన వస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్. దీని పైన చంద్రబాబు ఆలోచన ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. కడపలో మూడ్రోజులపాటు జరిగే మహానాడు ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నేతలు మాత్రం లోకేష్ కు కొత్త బాధ్యతలు ఖాయమని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!
తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత హల్‌చల్.. 12 ఏళ్లలోపు చిన్నారులను.!
జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!
మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!
భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..
జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LokeshLeadership #Mahanadu2025 #AllianceGovernment #TDPUpdates #NaraLokesh #PoliticalTransition #KeyDecision
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.